తెలంగాణ‌లో మొబైల్ షీ టాయిలెట్స్

తెలంగాణ‌లోనే మొద‌టిసారిగా ప్ర‌త్యేక మొబైల్ షీ టాయిలెట్స్ ప్రారంభం అయ్యాయి. నారాయ‌ణ పేట‌ జిల్లాలోని కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కోస్గి మండ‌లంలో క‌లెక్ట‌ర్ హ‌రిచంద‌న ఈ షీ టాయిలెట్స్ ప్రారంభించారు.

ఇక రాష్ట్రంలో క‌రోనా విస్త‌రిస్తున్న స‌మ‌యంలో స్వ‌యం స‌హాయ మ‌హిళా సంఘాల‌కు ఆయుర్వేద మాస్కులు కుట్టే అవ‌కాశాన్ని క‌ల్పించి, ప్ర‌భుత్వ యంత్రాంగంతోనే వాటిని అమ్మేలా చ‌ర్య‌లు తీసుకొని… మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలిచింది కలెక్ట‌ర్ హ‌రిచంద‌న‌. రాష్ట్రంలోనే తొలిసారిగా డ్రోన్ ద్వారా శానిటైజ‌ర్లు చ‌ల్లే ప్ర‌క్రియ‌ను కూడా నారాయ‌ణ‌పేట‌లో మొద‌లుపెట్టారు.

ఓవైపు టెక్నాల‌జీని వాడుకుంటూ, వెనుక‌బ‌డిన నారాయ‌ణ పేట జిల్లాలో మ‌హిళా చైత‌న్యానికి తోడ్పాటు అందిస్తున్నారంటూ ప‌లు మ‌హిళా సంఘాలు క‌లెక్ట‌ర్ చ‌ర్య‌ల‌ను స్వాగ‌తిస్తున్నాయి.

 

కొత్త‌గా ప్రారంభించిన మొబైల్ షీ టాయిలెట్స్ ఇవే…

Recent Posts