మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు ఇంకా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా విడుదలకు బ్రేక్ పడింది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించే థియేటర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కాగా అనంతపురం జిల్లాలో అత్యధిక సంఖ్యలో నివసిస్తున్న వాల్మీకి, బోయ సామాజిక వర్గాలు, సంఘాలు…. ‘వాల్మీకి’ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » వాల్మీకికి బ్రేక్