ఇప్పుడు చౌక ఇడ్లీ బామ్మకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రూపాయికే ఇడ్లీ, సాంబారు, చట్నీ ఇస్తున్న తమిళనాడు కోయంబత్తూరు జిల్లా వడివేలంపాళ్యం గ్రామానికి చెందిన 80 ఏళ్ళ కమలతల్ బామ్మను జిల్లా కలెక్టర్ రాసమణి తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు.
ఇల్లు కూలిపోయే దశలో ఉన్న బామ్మకు ప్రధాన మంత్రి అవాస యోజన పధకం కింద ఇల్లు నిర్మించడమే కాకుండా అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. భారత్ గ్యాస్ వారు బామ్మకు ఉచిత గ్యాస్ కనెక్షన్ మంజూరు చేశారు. శభాష్ ! బామ్మా అంటూ అంతా ఆమె సేవానిరతిని మెచ్చుకున్నారు. ఇలాంటి బామ్మ ఊరికొక్కరు ఉంటే చాలు పేదలకు ఆకలి దప్పులుండవు.