అష్టాచమ్మా సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కలర్స్ స్వాతి. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కాంట్రవర్శికి కేర్ ఆఫ్ వర్మ గురించి ప్రస్తావించింది. వర్మ దర్శకత్వంలో నేను సినిమా చేసిన తరువాత చాలా మంది నన్ను అడిగారు.
ఆయన అలాంటి వాడట కదా… ఇలాంటి వాడట కదా అని కానీ వర్మ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదని..అవసరానికి మించి నాతో ఎప్పుడూ కూడా మాట్లాడలేదని తెలిపింది. స్వాతి నువ్వు చాలా టాలెంటెడ్.. నిన్ను చూస్తుంటే రేవతి గుర్తొస్తుంది. కాకపోతే మీ ఇద్దరు కాస్త ఎక్కువగా ఆలోచిస్తారు. అలా కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో అనేవాడంటూ చెప్పుకొచ్చింది స్వాతి.