ఇటీవల కాలంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి రాజ్ పెద్దగా కనిపించింది లేదు. తన కామెడీతో పంచ్ డైలాగులతో ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న పృథ్వి… 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేశారు.ఆ సమయంలోనే మెగాఫ్యామిలీపై, జనసేన పార్టీ పై తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. ఇక ఎన్నికలలో వైసీపీ విజయం సాధించిన తర్వాత పృధ్వీరాజ్ కు ఓ పదవిని ఇచ్చారు. అది కూడా ఓ వివాదం పృథ్వి రాజ్ పోగొట్టుకున్నాడు.
ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వి రాజ్ మెగాఫ్యామిలీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నాగబాబు నాతో మాట్లాడడం లేదు. కానీ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. రాజకీయాల కోసం జనసేనాని పై విమర్శలు చేయాల్సి వచ్చింది. అదే మామూలుగా తిడితే జనాలు ఇంటికి వచ్చి మరీ నన్ను కొడతారు. నాకు వాళ్ల స్థాయి ఏమాత్రం లేదు. నేను ఏదైనా చేస్తే హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా ఉంటుందని చెప్పుకొచ్చారు పృథ్వి.