కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ అమలు దృష్ట్యా అంత ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కరోనాను ఇండియా నుంచి సాగానంపాలంటే లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేసిన దరిమిలా సాధారణ పౌరుల నుంచి దేశ ఉన్నత స్థాయి వ్యక్తుల వరకు అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎప్పుడు బిజీ, బిజీగా గడిపే సినీ తారలు, ఇండియన్ క్రికెటర్లు అంత ఇంట్లో గడుపుతున్నారు. ఇక, ఖాళీగా ఉండటంతో బోర్ కొడుతోందో ఏమో కాని ఇంట్లోనే ఎదో ఓ పని చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అలాగే లాక్ డౌన్ అమలుపై ప్రభుత్వాల సూచనలను తప్పక పాటించాలని కోరుతూ…ఇంట్లోనే ఉండాలంటూ సోషల్ మీడియాలో సూచనలు చేస్తున్నారు. బోర్ కొడితే తమలాగా ఇంట్లోనే ఎదో ఒక పనిలో నిమగ్నం కావాలని సూచిస్తున్నారు.
తాజాగా కమెడియన్ అలీ ఇంట్లో తన భార్యకు సహాయం చేస్తోన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంట్లో ఖాళీగా ఉండకుండా మా ఆవిడ చెప్పే పనులు చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు అలీ.రోజు కారును శుభ్రం చేయడంతో ఇంట్లో పని చేస్తున్నానని చెప్పాడు. కూరగాయలను కట్ చేస్తూ,వంట పని చేయడం వంటి పనులను చేస్తూ తన భార్యకు సహాయం చేస్తున్నానని చెప్పాడు.