Ali Daugther Fatima Marriage: టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ కూతురు ఫాతిమా వివాహం ఘనంగా జరిగింది. హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. టాలీవుడ్ కి చెందిన స్టార్ సెలెబ్రిటీస్ సందడి చేసారు.

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా ప్రముఖ హీరోలంతా హాజరయ్యారు. చిరంజీవి, అక్కినేని నాగార్జున సతీ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. సినీ రాజకీయ ప్రముఖులంతా తరలివచ్చారు. కమెడియన్ అలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. అలీ పెద్ద కూతురు ఫాతిమా రీసెంట్గా డాక్టర్ కోర్స్ ని పూర్తి చేసిందట.
అలీ కుటుంబంలో మొట్టమొదటి డాక్టర్ అయ్యింది. ఇక అలీ అల్లుడు షెహ్‌యాజ్ కూడా డాక్టర్ కావడం విశేషం.జమీలా బాబి, జలాని భాయ్ కు జన్మించిన కుమారుడే షెహ్యాజ్. షెహ్యాజ్ కు ఒక అన్నయ్య, చెల్లెలు కూడా ఉన్నారు. ఇక వీరే కాకుండా షెహ్యాజ్ వదిన కూడా ఒక డాక్టర్.. వీరంతా గుంటూరు ప్రాంతానికి చెందినవారు అయినప్పటికీ లండన్ లో స్థిరపడ్డారు.
Ali Daugther Fatima Marriage
వారి ఫ్యామిలీ అంతా ప్రస్తుతం లండన్‌లోనే ఉంటుంది.తన కూతురు డాక్టర్ చదివేసరికి అల్లుడిని కూడా డాక్టరే కావాలని ఏరికోరి మరి షెహ్యాజ్ ని ఎంపిక చేసుకున్నారట అలీ. ఇకపోతే అలీ అల్లుడు సంపాదన విషయానికి వస్తే.ఏడాదికి దాదాపుగా రెండు కోట్లకు వరకు సంపాదిస్తాడు అని అలీ సన్నిహితుల నుంచి సమాచారం.
అలీ కూతురు ఎంగేజ్‌మెంట్ మ్యారేజ్ అంతా ఘనంగా నిర్వహించారు. ఇటు రిసెప్షన్ కూడా మంగళవారం గుంటూరులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీసీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన వధువు వరులను ఆశీర్వదించారు సీఎం.ఈ మధ్యనే అలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారు పదవితో సత్కరించింది.
దీంతో అలీ కూతురి వివాహానికి సినీ తారలతో పాటుగా రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.ఏపీ మంత్రి రోజా కూడా ఈ పెళ్లిలో సందడి చేశారు. రిసెప్షన్‌కు సీఎంతో పాటు.. ఏపీ మంత్రి విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏసురత్నం, డిప్యూటీ మేయర్ సుజీలా, డైమండ్ వాజ్రా బాబు, గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హాఫిజ్, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్, మాజీ ఎంపీ మోదుగుల వేణు గోపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ హాజరయ్యారు