టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు అన్నీ చూశాం. ఇక నుండి అలీవుడ్ కూడా చూడబోతున్నాం… కొత్తగా ఈ అలీవుడ్ ఏంటీ అనుకుంటున్నారా…? స్టార్ కమెడియన్ అలీ ఓ నిర్మాణ సంస్థను స్థాపించాడు. దాని పేరే అలీవుడ్. ఎలాగైతే మల్లెమాల సంస్థ, గ్నాపిక ప్రొడక్షన్స్‌తో పాటు ప్రముఖ యాంకర్ ప్రదీప్ కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా వంటి షోలను అలీ ఇప్పుడు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. వీటితో పాటు వెబ్ సిరీస్‌లను కూడా మొదలుపెడతామని అలీ ప్రకటించారు.
శ్రీబాబా నేతృత్వంలో క్రియేటివ్ డైరెక్టర్ మనోజ్ హుస్సేన్ ఆద్వర్యంలో కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. అలీవుడ్ లోగోను ప్రముఖ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ, ప్రొడ్యూసర్ జయచంద్ర,అలీ బ్రదర్ ఖయ్యూం, హీరో రవివర్మ తదితరులు ఆవిష్కరించారు. సీరీయల్స్, స్పెషల్ ప్రోగ్రాంలు కూడా ఈ నిర్మాణ సంస్థ చేయబోతుందని అలీ ప్రకటించారు.