తన కామెడీ టైమింగ్ తో,పంచ్ డైలాగులతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నారు ముక్కు అవినాష్. అయితే ముక్కు అవినాష్ బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తను ఆర్థిక ఇబ్బందుల కారణంగానే బిగ్ బాస్ హౌస్ వైపు అడుగులు వేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇంటిలో లో అప్పులు ఎక్కువగా ఉన్నాయి.నాకు డబ్బులు అత్యవసరంగా మారాయి. దాంతో ఎనిమిది సంవత్సరాలుగా పని చేస్తున్న జబర్దస్త్ మేనేజ్మెంట్ ను అడిగా.. కానీ అప్పటికే ఇప్పటికే నష్టాల్లో ఉన్నామని ప్రస్తుతం ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేమని వారు చెప్పారు.
దీంతో నేను బిగ్ బాస్ కు వెళ్తాను అని అన్నాను. అలా కుదరదని అందుకు అగ్రిమెంట్ ఉందన్నారు. బిగ్ బాస్ లోకి వెళ్లాలంటే 10 లక్షలు కట్టాలన్నారు. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. 1,2 లక్షలు అడుగుతారు అనుకున్నా కానీ వారు ఏకంగా పది లక్షలు అడిగారు. దాంతో నా ఫ్రెండ్స్ సహాయంతో జబర్దస్త్ మేనేజ్మెంట్ కు డబ్బులు కట్టి నేను బిగ్ బాస్ లోకి వెళ్లాను అని చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ హౌస్ కి వెళ్లినందువలన తన అప్పులు తీరాయ అని ప్రశ్నించగా అప్పులన్నీ తీరినట్టు అవినాష్ చెప్పుకొచ్చారు.