2020 సంవత్సరంలో ఒకవైపు కరోనా మహమ్మారి సినీ ఇండస్ట్రీ కుదిపేస్తుంటే…మరోవైపు నటీనటుల మరణాలు విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా తమిళ ప్రముఖ కమెడియన్ వడివేల్ బాలాజీ కన్నుమూశారు. ప్రముఖ కమెడియన్ వడివేలును అనుకరించే బాలాజీ కి వడివేల్ బాలాజీ అనే పేరు వచ్చింది. ఇక బాలాజీ ఇటీవల గుండెపోటు రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అక్కడ నుంచి గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదయం చెన్నైలోని గవర్నమెంట్ ఆసుపత్రి లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. అధు ఇడు ఎడు, కలకపోవతు యారు వంటి టెలివిజన్ షోలతో వడివేల్ బాలాజీ పేరుగాంచాడు.