ప్రభాస్ 20వ చిత్రంలో కమెడియన్ ప్రియదర్శి నటిస్తున్నాడు. ఇటీవలే జార్జియాలో షూటింగ్ పూర్తిచేసుకొని ఇండియా తిరిగి వచ్చిన ప్రభాస్ టీంలో ప్రియదర్శి కూడా ఉన్నాడు. దీంతో… ప్రియదర్శి మార్క్ కామెడీ ఎంజాయ్ చేయవచ్చు అంటూ అనేది ప్రభాస్ అభిమానుల ఫిలింగ్.
అయితే, ఇప్పుడు ప్రపంచమంతా కరోనా వైరస్‌తో వణికిపోతున్న దశలో ప్రభాస్ టీం అంతా ఎయిర్‌పోర్ట్‌లో కరోనా వైరస్ స్క్రీనింగ్ టెస్ట్‌ను చేయించుకొని వచ్చింది. కానీ ఎందుకైనా మంచిది అనుకున్నాడో ఏమో… కమెడియన్ ప్రియదర్శి 14 రోజుల పాటు తనకు తాను స్వీయ నిర్భందంలో ఉండనున్నట్లు ప్రకటించాడు. ఎవరికి వారు దూరంగా ఉండటం వల్ల… కరోనా వైరస్‌కు చెక్ పెట్టవచ్చు. అందుకే నాకు నేను సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు.
అంతేకాదు వీరితో పాటు ఇండియా వచ్చిన ఓ ప్రయాణికుడు కరోనా టెస్ట్ చేస్తున్న వద్దకు వెళ్లి… నాకు దగ్గు, నలతగా ఉంది అని చెప్పటంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారని, అలా అందరూ చేస్తే కరోనా మన దరి చేరదు అంటూ ట్వీట్ చేశాడు. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.