600కు పైగా చిత్రాల్లో నటించిన వేణుమాధవ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. వ్యవసాయం అంటే ఎంతో ఇష్టపడే వేణుమాధవ్ నగర శివారులో 10 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. తొలిసారిగా ఎన్టీఆర్ వాయిస్‌ను మిమిక్రీ చేసి అందరి దృష్టిలో పడ్డారని వేణుమాధవ్ సన్నిహితులు చెబుతుంటారు. మొదట్లో అతను తెలుగుదేశం పార్టీ హిమాయత్‌నగర్ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్‌గా పనిచేశాడు. నటీనటుల సంఘంలో కార్యవర్గ సభ్యుడిగా సేవలందించారు.