హాస్యనటుడు మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి కాప్రా హెచ్‌బీ కాలనీలోని మంగాపురానికి తరలించారు. వేణుమాధవ్ మృతితో కాప్రా ప్రాంతంలో విషాధచాయలు నెలకొన్నాయి. తమ అభిమాన నటుడి కడసారి చూపుకోసం అభిమానులు మంగాపురం తరలివస్తున్నారు. గురువారం మధ్యాహ్నం వేణుమాధవ్ పార్టీవ దేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తారు. అక్కడ మధ్యాహ్నం 1 గంట నుంచి 2.30 వరకు అభిమానుల సందర్శనార్థం వుంచుతారు.