థియేటర్లలో వందశాతం సీట్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఒక్కొక్కటిగా సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఈ క్రమంలోనే డార్క్ కామెడీగా తెరకెక్కిన “క్షణ క్షణం” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 26న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించింది.
మన మూవీస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా కార్తిక్ మేడికొండ దర్శకత్వం వహించారు. టైటిల్ కి తగ్గట్టుగానే ఆద్యంతం ఉత్కంఠంగా సాగుతుందని, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను మెప్పిస్తుందని మూవీ మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.ఇప్పటికే విడుదలై ఈ సినిమాకు పోస్టర్స్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి.