ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే మూడు రోజులూ ముసురు తప్పదు. వాతావరణ శాఖ తాజాగా అందించిన సమాచారాన్ని బట్టి ఏపీలో వరుసగా మూడురోజులు వర్షాలు కురుస్తాయి.
గుంటూరు: రాబోయే మూడు రోజులలో ఏపీలోని 10 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలియజేసింది. 2, 3 రోజుల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలే కాకుండా నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురవొచ్చని తెలిపింది.