కేజీ కండలేని మళయాళీ మయూరి ఆమె.ఆమెకోసం అందమైన కథలు రెక్కలు కట్టుకువాలతాయి. అందమైన పాత్రలు పురుడు పోసుకుంటాయి. జానపథాలు ఆమెను వెతుక్కుంటూ వస్తాయి. నృత్యం ఆమె అడుగుల్లో అడుగుకలపడానికి ఉవ్విళ్ళూరుతుంది. ఆమె ఎవరోకాదు తెలుగు తెరపై వెన్నెల్లా విరబూసిన సారంగదరియా… సాయిపల్లవి.
చేసినవి వేళ్ళమీద లెక్కపెట్టే సినిమాలు. కానీ ఏళ్ళతరబడి గుర్తుండిపోతాయి. నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ మధ్య కాలంలో తన నుంచి ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ కాలేదు. ఆమె నుంచి ఒక్క సినిమా కూడా రాలేదంటే కారణం అవకాశాలు రావడం లేదని కాదు.ఆమెకు నచ్చే కథలు ఆమె దగ్గరుకు వెళ్ళలేదని.!
తాజాగా ఈ కేరళాకుట్టి నుంచి ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఒక తెలుగు వెబ్ సిరీస్ చేయనుందని టాక్ వినిపిస్తోంది. శేఖర్ కమ్ముల శిష్యుడు ఒక వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేశాడట. సాయి పల్లవి అయితేనే సదరు క్యారెక్టర్‌కి బాగా సూట్ అవుతుందని భావించి ఆమెను సంప్రదించారట. స్టోరీ నచ్చడంతో సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.