దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం స్థిరంగా ఉన్నాయి. దీంతో కొంత ఉపశమనం లభించిందని అందరూ అనుకున్నారు. అంతలోనే వాణిజ్య సిలిండర్ల ధరను భారీగా పెంచుతున్నట్టు చమురు కంపెనీ సంస్థలు బాంబు పేల్చాయి.
కమర్షియల్ సిలిండర్ ధరను శుక్రవారం ఏకంగా రూ. 250 లను పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లిలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2253కు పెరిగింది. కోల్‌కతాలో ధర రూ 2,351, ముంబై, చెన్నైలలో ధరలు వరుసగా రూ. 2, రూ. 2052,406గా ఉన్నాయి.
వాణిజ్య సిలిండర్ల ధరలను గత నెలలో రూ105 పెంచారు. గృహావసరాలకోసం ఉపయోగించే సిలిండర్లపై ఎలాంటి పెంపు లేకపోవడం ఊరట కలిగించే అంశం. దేశీయ వంట గ్యాస్ ధరలను మార్చిలో చివరిసారిగా సవరించారు. సిలిండర్ పై రూ. 50 పెంచారు.
దీంతో దేశ రాజధానిలో ఇప్పుడు 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ. 949.50గా ఉంది. అక్టోబర్ ప్రారంభం తర్వాత ఎల్‌పీజీ ధరలు పెరగడం ఇదే తొలిసారి. దేశంలో గురువారం పెట్రోల్, డీజిల్ పై 80 పైసలను చమురు కంపెనీలు పెంచాయి.