దేశంలో మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో సిలిండర్ పై రూ. 105ను పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు తెలిపాయి.
తాజాగా ప్రకటించిన ధరల ప్రకారం.. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్(19 కిలోలు) పై రూ. 105 పెరిగింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2012కు చేరుకుంది. కమర్షియల్ సిలిండర్ ధరలు కోల్ కతాలో రూ. 2,095, ముంబై రూ. 1,963గా ఉన్నాయి.
ఇక 5 కిలోల సిలిండర్ పైనా రూ. 27 పెంచినట్టు ఆయిల్ కంపెనీలు తెలిపాయి. దీంతో దేశ రాజధానిలో 5 కిలోల సిలిండర్ ధర రూ. 569గా ఉంది.
గృహావసరాల కోసం వాడే వంటగ్యాస్ ధరల్లో ఈ సారి ఎలాంటి మార్పులూ చోటు చేసుకోలేదు. ఇది సామ్యానులకు కాస్త ఊరట కలిగించే విషయనే చెప్పాలి.