దేశంలో ధరల మోత మోగుతోంది. వాణిజ్య సిలిండర్ ధరను మరోసారి పెంచేశాయి ఆయిల్ కంపెనీలు. ప్రస్తుతానికి గృహ వినియోగదారులపై భారం పడకుండా కనికరించాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల సిలిండర్ పై భారీగా వడ్డించాయి సంస్థలు. ఒకేసారి రూ.104 పెంచి షాకిచ్చాయి.
దీంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2563.5కి పెరిగింది. గతంలో ఇది రూ.2460గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.102.5 పెరగటంతో రూ.2355.5కు చేరింది. ముంబైలో రూ.2329.50, కోల్ కతాలో రూ.2477.50, చెన్నైలో రూ.2508కి పెరిగింది.
ఐదు కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.655కు చేరింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నెలనెలా సిలిండర్ల రేట్లను సవరిస్తుంటాయి చమురు సంస్థలు.
గత నెల 1న కమర్షియల్ సిలిండర్ పై రూ.268.5 వడ్డించాయి. తాజాగా మరో రూ.104 పెంచి రెండు నెలల్లోనే రూ.372 ప్రజలపై భారం మోపాయి.