ప్రేయసి నమ్మకద్రోహంతో పిచ్చివాడినయ్యానంటూ ప్రియుడు రాసిన సూసైడ్ లెటర్ కలకలం రేపుతోంది. ప్రేమించి మోసపోయానంటూ విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థి అబ్దుల్ సలామ్ ఆత్మహత్య చేసుకున్నాడు.
సూసైడ్ చేసుకోబోయే ముందు ఓ లెటర్ రాశాడు అబ్దుల్. లెటర్ లో ఓ యువతి తనను ప్రేమించానని రాసుకొచ్చాడు. కానీ తన ప్రేయసి ప్రవర్తనలో కొంత కాలంగా తేడా వచ్చింది. ఆరా తీస్తే.. పెళ్లైన లెక్చరర్ తో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ రిలేషన్ షిప్ నడుపుతుందని తెలియడంతో జీర్ణించుకోలేకపోయాను.
దీంతో ఆ అమ్మాయిని మార్చాలని ఎంతో ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇవన్నీ వదిలేయమని ప్రేయసికి చెప్పినా కూడా రాత్రి 1.30 తరువాత వీడియో కాల్స్ మాట్లాడుతుందని అబ్దుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
తన టైమ్ పాస్ ప్రేమ వల్ల పిచ్చివాడ్ని అయ్యానని, బ్రతకలేకపోతున్నానని లెటర్ లో వివరించాడు. మోసపోయిన అమాయకపు అబ్బాయిలకు న్యాయం చేయాలంటూ లెటర్ లో మీడియాను వేడుకున్నాడు అబ్దుల్. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.