జర్నలిజమే ప్రాణంగా, ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తున్న నిఖార్సైన జర్నలిస్ట్ రవి ప్రకాష్. టెలివిజన్ చరిత్రలోనే మొట్ట మొదటి ప్రాంతీయ ఛానెల్ ను ప్రారంభించి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు రవి ప్రకాష్.15 సంవత్సరాలుగా తను స్థాపించిన టీవీ9 తెలుగులో నంబర్ 1 ఛానెల్ గా దూసుకుపోయింది. దీనికి కారణం రవి ప్రకాష్ అందులో సందేహం లేదు. ఎన్నో సమస్యల మీద టీవీ9 వేదికగా పోరాటం చేసి సక్సెస్ సాధించారు.మరెన్నో కుంభ కోణాలు బయట పెట్టారు. ఇది సహించని పాలక వర్గాలు, వారి బినామీ లు టీవీ9 ను దొడ్డి దారిన ఆక్రమించి, రవి ప్రకాష్ ను బయటకు పంపిన విషయం మనకే తెలిసిందే.
జర్నలిజ మే ఊపిరి గా బతికిన రవి ప్రకాష్ తొలి వెలుగుతో కబ్జా కోరుల గుండెల్లో రైళ్లు పరిగె త్తి స్తున్నారు . ఇది జీర్ణించుకోలేని అరాచక శక్తులు రవి ప్రకాష్ ను జైల్లో పెట్టించా యి.
కానీ తమ సమస్యల మీద పోరాటం చేస్తున్న రవి ప్రకాష్ అరెస్ట్ మీద ప్రజలు స్పందిస్తున్నారు. భవిష్యత్తులో దోపిడీ దారుల చేతుల్లో ఉన్న ఛానెల్స్ కి ప్రత్యామ్నాయంగా మరో ఛానెల్ రావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. డబ్బులు మేము కలెక్ట్ చేసి , ప్రజల కోసం మాట్లాడే ఛానెల్ కోసం మా వంతు సహాయం అందిస్తామఅంటున్నారు.జర్నలిజం బతకాలని నినదిస్తున్నారు.