మీరు ఈ అవినీతిని చూసి తట్టుకోలేరు విజయసాయిరెడ్డి గారు -common man open letter to ycp mp vijayasai reddy over his corruption - Tolivelugu

మీరు ఈ అవినీతిని చూసి తట్టుకోలేరు విజయసాయిరెడ్డి గారు

 

విజయ సాయి రెడ్డి గారు,
రాజ్యసభ ఎంపీ

విషయం: మీరు మాత్రమే పరిష్కరించ గలిగే కేసుల గురించి..

common man open letter to ycp mp vijayasai reddy over his corruption, మీరు ఈ అవినీతిని చూసి తట్టుకోలేరు విజయసాయిరెడ్డి గారు

నీతికి, నిజాయితీకి మారుపేరైన విజయసాయిరెడ్డి గారికి విధేయతతో నమస్కరించి రాయునది ఏమనగా, ప్రియమైన రెడ్డి గారూ.. కాలం మారింది సర్, ఎంతలా అంటే.. అత్యంత ఘోరంగా వేల కోట్ల అక్రమ ఆస్తుల కేసుల్లో A2 గా ఉన్న వ్యక్తి ఈడి, ఫెమా, సీబీఐ లాంటి సంస్థల చేత ఒక జర్నలిస్ట్ మీద దర్యాప్తు చేయండని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేసే అంతగా పరిస్థితి దిగజారిపోయింది సర్. అందరూ మీలా నిజాయితీగా ఉంటారా చెప్పండి.

ఒక సామాన్యుడిగా అడుగుతున్నా సర్, మీరేదో అక్రమాలను అరికట్టే పనిలో పడ్డారు కదా, ఒక చిన్న సహాయం చేయండి సర్ ప్లీజ్, మా తెలంగాణలో జూపల్లి రామేశ్వర్ రావు అనే వ్యక్తి ఉన్నారు, ఆయనకు 220 కంపెనీలు ఉన్నట్టు తెలిసింది. పదేళ్ల క్రితం ఏమిలేని అయ్యవారికి 220 కంపెనీలు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో మా ప్రజలకు అర్థం కావట్లేదు సర్. ఇక్కడ అడిగే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు రెడ్డి గారూ.. దయచేసి మీరే అడగాలి. ఇలాగే సుప్రీం కోర్టు జడ్జికి లేఖ రాయాలి. మీరు అవినీతిని అస్సలు సహించని మహాత్ముడి వారసుడిగా భావించి మిమ్మల్ని అడుగుతున్నా సర్ ప్లీజ్.
మొన్నటికి మొన్న మైహోమ్ మీద gst రైడ్స్ జరిగితే అసలు ఎంత బయటపడింది ఎవరు చెప్పట్లేదు రెడ్డి గారు, దమ్మున్న మీరే మాకు చెప్పాలి. వేల ఎకరాల భూములను కబ్జా చేశారట సారు. దయచేసి ఆ దళిత బిడ్డలను మీరు ఆదుకోండి పుణ్యం ఉంటది. ఇదంతా మీడియాలో రాదు సర్, మీ ‘సాక్షి’గా విచారణ చేయండి. బాంచన్ నీ కాల్మొక్త పటేలా…

ఆర్టీసీని మేఘా కృష్ణారెడ్డి మింగేస్తున్నడని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు సారూ. మొత్తం 3500 కోట్లు మెఘాకు రావడం కోసం 50 వేల కుటుంబాలను రోడ్డు మీద పడేస్తున్నారు రెడ్డి గారు. కాళేశ్వరంలో 34 వేల కోట్లు తినేసారట. నాకు తెలుసు విజయసాయిరెడ్డి గారు మీరు ఈ అవినీతిని చూసి తట్టుకోలేరు. మీ ‘సాక్షి’గా నిగ్గు తేలాలి సర్. అవును సర్ నాకు ఒక్కటి అర్థం కావట్లేదు…రవి ప్రకాష్ అరెస్ట్, ఆరోపణలు, ఆర్టీసీ 50 వేల కుటుంబాల అక్రందనను డైవర్ట్ చేయడం అంటున్నారు నాకు తెలియట్లేదు సర్, దయచేసి చెప్పండి. మీ మన ‘సాక్షి’ అబద్దం చెప్పదు సర్, అన్ని నిజాలే చెప్తుంది.

అప్పట్ల చంద్రబాబు నాయుడు మీద అదేదో పుస్తకం మీ ముఖ్యమంత్రి రిలీజ్ చేశారు కదా.. అందులో మెఘా కృష్ణారెడ్డిని దుర్మార్గుడు, అవినీతిపరుడు అని రాశారు సర్.. అది మీరు రాసిందే కదా…అందుకే మిమ్మల్నే అడుగుతున్న సర్ మీరు మాట తప్పర్.. మడమ తిప్పరు… మీరు దీని మీద విచారణ అడగాలి సర్. మీరు అడుగుతారు సర్. మీరు లెక్కల్లో ఫస్టు.. చాలా ఫాస్ట్ సర్.. అందరి లెక్కలు తేలుస్తారు. ఏమైనా సత్య హరిశ్చంద్రుడు తరువాత మీరే సర్, అందుకే మిమ్మల్నే అడుగుతున్నా…

ఇంతకీ ప్రియతమ ముఖ్యమంత్రి ఈ శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారా సర్ ???

ఇట్లు…

సామాన్యుడు

Share on facebook
Share on twitter
Share on whatsapp