ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం. నిజమే కానీ అది ఒకప్పుడు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సు అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. సమ్మె కారణంగా బస్సులన్నీ ప్రైవేటు డ్రైవర్ల చేతిలో నడుస్తున్నాయి. వారిలో చాలా మందికి అనుభవం లేదు. ఎక్కడికక్కడ ప్రమాదాలు, బస్సులు బోల్తా పడటం చూస్తున్నాం. దీంతో… ఒకప్పుడు ఆర్టీసీ బస్సు మాత్రమే ఎక్కాలి అనే పరిస్థితి నుండి అమ్మో ఆర్టీసీ బస్సా అంటున్నారు ప్రయాణికులు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు రెండువారాలు కావస్తున్నా ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవటంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. ఇలానే సమ్మె కొనసాగితే ప్రమాదాలు పెరుగుతూనే ఉంటాయి అని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.