అడవి శేషు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంటున్నాడు. గతంలో క్షణం, అమీ తుమీ, గూడచారి, ఎవరు వంటి సినిమాలతో వరుస హిట్లు అందుకున్న అడవి శేషు ప్రస్తుతం మేజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు.
ముంబై ఉగ్రవాద దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్నారు. జూన్ 3వ తేదీన భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది.
ఆ సినిమాలో పవన్ నో చెప్తే శ్రీకాంత్ నటించాడట!
ఈ సినిమా తర్వాత నాని నిర్మిస్తున్న హిట్ ది సెకండ్ కేస్ సినిమా జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా లో కూడా అడవి శేషు హీరోగా నటించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మేజర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సాయి మంజ్రేకర్ హిట్ సినిమాలో నటిస్తున్న మీనాక్షి చౌదరి ఇద్దరికీ కూడా అడవి శేషు తో చేస్తున్న సినిమా కెరీర్ లో మూడో సినిమా కావడం విశేషం.
దబాంగ్ 3,గని సినిమాల తర్వాత సాయి మంజ్రేకర్ మేజర్ సినిమా చేస్తుంది. అలాగే మీనాక్షి చౌదరి ఇచ్చట వాహనాలు నిలుపరాదు, ఖిలాడి సినిమాల తర్వాత హిట్ 2 లో నటిస్తోంది. మరి ఈ సినిమాలు ఎలాంటి విజయం సాధిస్తాయో చూడాలి.