టాలీవుడ్ లో మరో కొత్త పుకారు ఊపందుకుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న అనుష్క కథనే కాపీకొట్టి స్వాతిముత్యంగా తీశారంట. దీనికి కారణం ఈ రెండు సినిమాల్లో సరోగసీ కాన్సెప్ట్ ఉండడమే. మరి ఈ పుకారులో నిజం ఎంత?
ముందుగా స్వాతిముత్యం సినిమా విషయానికొద్దాం. ఓ మంచి ఉద్దేశంతో హీరో, మరో కుటుంబానికి వీర్యం దానం చేస్తాడు. కానీ పిల్లాడు పుట్టే టైమ్ కు బాబును తీసుకెళ్లాల్సిన కుటుంబం యాక్సిడెంట్ కు గురవుతుంది. సరిగ్గా హీరో పెళ్లి టైమ్ కు ఈ బాబు అడ్డం పడతాడు. దీంతో హీరోనే బాబును పెంచుకుంటాడు. ఇదీ కాన్సెప్ట్.
ఇక అనుష్క సినిమా విషయానికొద్దాం.. నవీన్ పొలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లు గా వస్తున్న ఈ సినిమాలో కూడా సరోగసీ కాన్సెప్ట్ ఉంది. కాకపోతే ఇక్కడ విషయం వేరు. అనుష్కకు వైవాహిక బంధంపై నమ్మకం లేదు. కానీ తన పోలికలతో బేబీకి జన్మనివ్వాలని అనుకుంటుంది. దీంతో నవీన్ పొలిశెట్టిని ఎంపిక చేసుకుంటుంది. ఇలా సాగుతుంది అనుష్క సినిమా.
సో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్నట్టు అనుష్క కొత్త సినిమాకు, స్వాతిముత్యం సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. దేనికథ దానిదే. ఎవరి సినిమా వాళ్లదే.