పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి వచ్చాడు. చేతిలో కాగితం పట్టుకుని రావడంతో పిర్యాదు చేయడానికి వచ్చారని పోలీసులు భావించారు. పీఎస్ కు వచ్చిన సదరు వ్యక్తి కూడా తన చేతిలో ఉన్న పిర్యాదు కాపీని అక్కడున్న పోలీసు అధికారికి ఇచ్చాడు. అది తీసుకుని ఆ పిర్యాదును చదివి పోలీసులు అవాక్కయ్యారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. పోలీసులు ఎందుకు షాకయ్యారు..? ఆ పిర్యాదులో ఏముంతో తెలిస్తే మీరు కూడా ముక్కున వేలేసుకోవడం పక్కా.
మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన ధారవత్ పూల్య నాయక్ కుక్కపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గూడూరు మండలంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం సమీపంలో ఉండే ఓ కుక్క..తనను ప్రతీ సారిమ పగపట్టినట్టే కరుస్తోందని పిర్యాదులో పేర్కొన్నాడు.
కుక్కను పెంచుకున్న వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు పూల్య నాయక్. ఈ ఫిర్యాదు ను చూసి అవాక్కయ్యారు పోలీసులు. పిర్యాదు ఇచ్చిన పూల్యనాయక్ తో మాట్లాడిన పోలీసులు.. కుక్కను పెంచుతున్న వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు.
కుక్క ఎవరిని కరవకుండా చూడాలని ఆదేశించారు. కుక్క కరిచిన దారవత్ పూల్య నాయక్ ను చికిత్స చేసే బాధ్యతను ఓనర్ కు అప్పగించారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.