పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి బక్క జడ్సన్ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ కి ఫిర్యాదు చేశారు. దళిత నాయకులను అఖిలపక్ష సమావేశంలో నిలబెట్టి అవమానించారని వివరించారు. ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు జడ్సన్.
శనివారం ధర్మారెడ్డి అధ్యక్షతన జిల్లా సాధన సమితితో పాటు అఖిలపక్ష నేతలతో సమావేశం జరిగింది. ఇందులో జెడ్పీటీసీ సిలువేరు మొగిలి, ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత.. ధర్మారెడ్డి వెనకాల నిలబడి, చేతులు కట్టుకుని కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. మీడియాలో కథనాలు రావడంతో ధర్మారెడ్డి తీరు వివాదాస్పదమైంది.
గతంలోనూ దళితులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసి చివరకు క్షమాపణ చెప్పారు. తాజా ఘటనతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈ ఇష్యూని అంత తేలిగ్గా వదలమని అంటున్నారు బక్క జడ్సన్. అందుకే ఎన్‌సీఎస్‌సీ కి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Advertisements