గుంటూరు: మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారిపై కేసు నమోదయ్యింది. విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్‌ఐ అనురాధ, ఇతర సిబ్బందిపై రాజకుమారి అసభ్య పదజాలంతో దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ కేసు పెట్టారు. దాంతో నన్నపనేని రాజకుమారి, సత్యవాణిలపై ఐపీసీ సెక్షన్లు 353, 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఇలావుంటే, దళిత ఎస్‌ఐని అడ్డం పెట్టుకొని ప్రతిపక్షంపై బురద చల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని మాజీ ఎమ్మెల్యే అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దళితులను ముందు పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తే ఎవరూ బాగుపడరని అన్నారు. దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే హోంమంత్రి శిబిరంలో ఉన్న బాధితులను పెయిడ్ ఆర్టిస్టులన్నప్పుడు ఆమె దిష్టి బొమ్మలు దహనం చేసే వారమని చెప్పారు.