పటాస్ ఫుల్ టు బిందాస్ అంటూ బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ శ్రీముఖి. యాంకర్ గానే కాకుండా సినిమాల్లో కూడా నటిస్తూ టాలెంట్ చూపిస్తుంది ఈ అమ్మడు. అయితే తాజాగా శ్రీముఖి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. నల్లకుంటకు శర్మ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ప్రముఖ టెలివిజన్ చానల్లో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన ఓ షోలో బ్రాహ్మణులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ శర్మ బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు శ్రీముఖితోపాటు, సదరు టీవీ యాజమాన్యంపై పోలీసులుకు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.