వనపర్తి మున్సిపాలిటీలో అక్రమాలకు అంతే లేకుండాపోతోంది. వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎస్ సోమేష్ కుమార్ ను కలిశారు అఖిలపక్ష నాయకులు. హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కు వెళ్లిన నేతలు సీఎస్ కు వినతిపత్రం అందజేశారు. శ్రీధర్ ను పదవిలోనుంచి తొలగించాలని కోరారు.
వనపర్తిలో నయా చెరువు కట్టను ధ్వంసం చేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు 40 ఫీట్ల రోడ్డు, పార్కు చేసి ఇవ్వడానికి.. వాకిటి శ్రీధర్ రూ.75 లక్షలు తీసుకున్నాడని ఆరోపించారు అఖిలపక్ష నేతలు. జిల్లా కలెక్టర్ సైతం దీనిపై స్పందించడం లేదని అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డికి భయపడి వైస్ చైర్మన్ పై చర్యలు తీసుకోవట్లేదని విమర్శించారు. అందుకే సీఎస్ ను కలిసి మొత్తం వివరాలు అందించినట్లు తెలిపారు అఖిలపక్ష నేతలు.