దివ్యాంగుల పేరుతో కొన్ని ఎన్జీవో సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని.. కేసు పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు అందింది. అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక ఈ కంప్లయింట్ చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా సంస్థలను నడుపుతున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ కు వివరించారు వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు.
కొన్ని ఎన్జీవో సంస్థలు దివ్యాంగుల పిల్లల నుంచి నెలకు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పినాకిల్ సంస్థలో ఒక మూగ బాలుడికి గాయాలు అయ్యాయని.. దానిపై కేసు నమోదు చేయాలని కోరారు. రాష్ట్రంలో చాలా సంస్థలు ఇలాగే కొనసాగుతున్నాయని.. వాటివల్ల దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.