నిత్యం వివాదాల్లో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదంలో ఇరుక్కున్నారు. వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలి.. స్త్రీ జాతికి నేనొక్కడినే దిక్కువుతానంటూ ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై మహిళా న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు హెవెన్ హోం సొసైటీ సభ్యులు సైతం ఆర్జీవీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పెదకాకాని పోలీసు స్టేషన్ లో వేర్వేరుగా ఫిర్యాదులు చేశారు. అలాగే నాగార్జున యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ పైనా చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో కోరారు. ఇక పోతే ఈ నెల 16న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఎకడమిక్ ఎగ్జిబిషన్ కార్యక్రమానికి సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ పరిధిలోని 75 కళాశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ… నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
నచ్చింది తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి అని పిలుపునిచ్చారు. చనిపోయాక స్వర్గానికి వెళితే.. అక్కడ రంభ, ఊర్వశి ఉండకపోవచ్చు.. అందుకే ఏదైనా ఇక్కడే ఎంజాయ్ చేయాలి. అంతే కాదు వైరస్ వచ్చి తాను తప్ప మగజాతి అంతా పోవాలి.. స్త్రీ జాతికి నేకొక్కిడినే దిక్కు అవుతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.