అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ నేతలు బుధవారం మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ,జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీపై కేసు పెట్టాలని హెచ్ఆర్సీని కోరారు.
ఈ సందర్భంగా షేమ్ కేటీఆర్, షేమ్ మేయర్ అంటూ కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ..వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. మేయర్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ మీద ఉన్న దృష్టి.. మున్సిపల్ శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక కూడా కేటీఆర్ కు లేదా..అని ప్రశ్నించారు. హెచ్ఆర్సీకి జడ్జి లేక రెండు నెలలు అవుతున్నా.. ప్రభుత్వం ఇంకా జడ్జిని నియమించడం లేదని విమర్శించారు.