వనపర్తి జిల్లా కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించారు వార్డు మెంబర్ శివ. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేశారన్న కారణంతో వార్డు మెంబర్ శివ యాదవ్ పై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు.
అంతే కాకుండా మంత్రిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడని తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బూటు కాలితో తన్నడంతో పాటు, విచక్షణ రహితంగా సీఐ శ్రీనివాస్ రెడ్డి దాడి చేశాడని పిటిషన్ లో పేర్కొన్నాడు బాధితుడు. సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని కోరాడు బాధితుడు.
పోలీస్ కస్టడీలో పెట్టుకొని స్వయంగా మంత్రి నిరంజన్ రెడ్డికి కాల్ చేసి క్షమాపణ చెప్పించారన్న బాధితుడు శివ పేర్కొన్నారు. సీఐ శ్రీనివాస్ రెడ్డి వ్యవహార శైలిపై హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యూగేందర్ గౌడ్ పేర్కొన్నారు. సీఐపై చర్యలు తీసుకునేదాకా వదిలేదని స్పష్టం చేశారు రాచాల యుగేందర్.