లోన్ యాప్స్ వేధింపులపై డీజీపీకి వినతిపత్రం ఇచ్చిన టీడీపీ మహిళా నేతలు.తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార సమితి అధ్యక్షులు ఆచంట సునీత ఆద్వర్యంలో డీజీపీని కలిసిన మహిళలు
లోన్ యాప్ వేధింపులు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్నాయి.గతంలో మైక్రో ఫైనాన్స్, ఇప్పుడు లోన్ యాప్స్రుణాలిచ్చి వడ్డీ, చక్రవడ్డీ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు
వాయిదా చెల్లించడం ఆలస్యమైతే వేధింపులకు దిగుతున్నారు.లోన్ యాప్ వేధింపులు భరించలేక ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.ప్రత్యేకంగా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు
వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారువేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.లోన్ యాప్స్ ను బ్యాన్ చేసేలా చొరవ తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు