కంప్యూటర్ వాడకం అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కంప్యూటర్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వర్క్ ఫ్రం హోం కావడంతో చాలా మంది గంట గంటల పాటు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తున్నారు. ఈ క్రమంలో కంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. అలానే కూర్చుని చూడటం, ఎక్కడికి కదలకపోవడం సమస్య మరింత తీవ్రమవుతుంది.
Also Read:నటి దీప గుర్తుందా ? ఇప్పుడు ఎలా మారిపోయిందో తెలుసా ?
అసలు ఈ సమస్యకు పరిష్కారం ఉన్నా సరే చాలా మంది పట్టించుకోవడం లేదు. మనం ఎక్కువ సేపు ఏకధాటిగా తెరమీదే దృష్టి కేంద్రీకరించకుండా అప్పుడప్పుడూ తల తిప్పి కొంచెం దూరంలో ఉన్న వస్తువులు చూస్తూ ఉండటం అనేది చాలా మంచిది. గంటకో సారి స్క్రీన్ దగ్గర నుంచి లేచి అటూ ఇటూ నడవడం కూడా మనకు మంచి చేస్తుంది. ఇక మన శరీరంలో అన్ని అవయవాలకూ ఇది ఇంకా మంచిది.
తప్పనిసరిగా ఎక్కువ సమయం పని చేసేవాళ్ళు నీలికాంతిని అడ్డుకునే కళ్ళద్దాలు వాడాల్సి ఉంటుంది. వాడవచ్చు. స్క్రీన్ కాంతి మరీ ఎక్కువ, మరీ తక్కువ కాకుండా కళ్ళకు సరిపోయే విధంగా సెట్ చేసుకోవాలి. స్క్రీన్ మీద కనపడే అక్షరాలు చదవడానికి వీలున్న పరిమాణంలో ఉండేలా జూమ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మంచి ఎర్గానమిక్స్ పాటించడం, అంటే తెర కళ్ళకు సమాంతరంగా ఉండే విధంగా సరైన దూరంలో ఉండే విధంగా సెట్ చేసుకోవాలి. రాత్రి సమయంలో ఎక్కువ కాంతి లేకుండా చూడాలి.