శంషాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుండి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏకంగా ఎనిమిది గంటలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం 11.45 వెళ్తుందని అధికారులు ప్రకటన చేయడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. అయితే ఫ్లైట్ ఇప్పటి వరకూ రాలేదు.
దీంతో ప్రయాణికులకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కనీసం ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో కూడా ఎయిర్ ఇండియా సిబ్బంది క్లారిటీ ఇవ్వడం లేదంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
అయితే విమానంలో టెక్నికల్ ఇష్యూ కారణంగా ఆలస్యమయిందని ఎయిర్ పోర్టు సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ప్రయాణికులు ఉదయం నుంచి ఎయిర్ పోర్టులో వేచి ఉన్నామని, సిబ్బంది కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదంటూ తీవ్రంగా మండిపడుతున్నారు.