మద్యప్రదేశ్ కు చెందిన రోహిత్ గవర్నమెంట్ ఉద్యోగి…అదే ఆఫీస్ లో పనిచేస్తున్న మహిళతో 5 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నాడు. రోహిత్ కు అప్పటికే పెళ్లై…. 18 సంవత్సరాల అమ్మాయి కూడా ఉంది. రోహిత్ ప్రేమ విషయం రోహిత్ భార్యకు తెలవడంతో ఈ విషయమై అనేకమార్లు గొడవలు జరిగాయి.
ఎంత చెప్పినా వినకపోవడం విసుగెత్తిన భార్య…. రోహిత్ ను ఆయన లవర్ తో ఉండేందుకు అనుమతినిచ్చింది కాకపోతే 1.5 కోట్లు తమకు భరణంగా ఇవ్వాలనే కండీషన్ ను పెట్టింది. పెళ్లిచేసుకున్నప్పటి నుండి భర్త తనతో సఖ్యంగా ఉన్నది లేదని…కూతుర్ల భవిష్యత్ కోసమైన ఆ డబ్బులు పనికొస్తాయనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది రోహిత్ భార్య.