కరోనాపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోవ్ అథనోమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ కరోనాను అంతం చేయాలని ధృడంగా అనుకున్నరోజు మహమ్మారి అంతమైపోతుందని అన్నారు.
‘ మనం రెండేండ్ల క్రితం కలుసుకున్నప్పుడు మనమంతా కరోనా గుప్పిట్లోకి వెళుతున్నాము. రాబోయే రోజుల్లో్ మనం మూడో సంవత్సరంలోకి వెళతామని అప్పుడు ఎవరూ ఊహించలేదు” అని అన్నారు.
‘ ప్రస్తుతం పరిస్థితులు కరోనా మరింత వేగంగా వ్యాపించేందుకు, ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుక వచ్చేందుకు అనుకూలంగా ఉన్నాయి. కానీ మనమంతా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మనమంతా సమాయత్తమైతే కరోనాను అంతమొందించ వచ్చు” తెలిపారు.
‘ కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండటం, వ్యాక్సినేషన్ కవరేజ్ అధికంగా ఉన్నాయి. అలాంటి దేశాల్లో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. అయితే కరోనా అంతమైందన్న ప్రమాదకర వార్తలను అలాంటి దేశాలు కొన్ని ప్రచారం చేస్తున్నాయి. కానీ అది వాస్తవం కాదు” అని పేర్కొన్నారు.
‘ ప్రస్తుతం మన దగ్గర కరోనాపై పోరుకు సమర్థవంతమైన ఆయుధాలు ఉన్నాయి. కరోనా మహమ్మారిని ఎలా అంతం చేయాలో ఇప్పుడు మనందరికి తెలుసూ. కాబట్టి మనమంతా సమిష్టిగా పోరాడితే కరోనాను అంతం చేయవచ్చు” అని చెప్పారు.