చట్ట సభల్లో థర్డ్ జెండర్స్ కు రిజర్వేషన్ కల్పించాలని మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ ఈ శీతాకాల సమావేశాల్లో చేసే చట్ట సవరణతో పాటు ఆంగ్లో ఇండియన్స్ కు కల్పించిన రిజర్వేషన్ల స్థానంలో థర్డ్ జెండర్స్ కు అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని కోరారు. ఆంగ్లో ఇండియన్స్ ఇప్పుడు లేరని..ఉన్న వారంతా ఇండియన్స్ గా మారి సమాజంలో మంచి స్థితిలోనే ఉన్నారనన్నారు. వారి స్థానంలో సమాజంలో కింది స్థాయిలో ఉన్న థర్డ్ జెండర్స్ కు అవకాశం కల్పిస్తే వారికి కూడా చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించినట్టవుతుందన్నారు. దీని కోసం రిజర్వేషన్లను పెంచడం గానీ, తగ్గించడం గానీ జరగదన్నారు. థర్డ్ జెండర్స్ కు చట్ట సభల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించడం వల్ల వారికి సముచిత స్థానం ఇచ్చినవారమవుతామని లేఖలో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.