ఎంపీ రేవంత్ రెడ్డిని పదే పదే వ్యతిరేకిస్తూ, సీనియర్ నేతగా ఉన్న వీహెచ్ బహిరంగంగానే విమర్శించటంపై కాంగ్రెస్ కార్యకర్తలే మండిపడుతున్నారు. అయితే, రేవంత్ కోసం వీహెచ్ కు ఫోన్ చేసిన వరంగల్ జిల్లాకుక చెందిన కమల్ అనే కార్యకర్తను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
తనను అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటూ వీహెచ్ చేసిన ఫిర్యాదుతో పోలీసులు కమల్ ను అదుపులోకి తీసుకొని, రాయదుర్గం తీసుకొచ్చారు. రేవంత్ ను తిట్టడంతోనే వీహెచ్ కు ఫోన్ చేసి, ఇరువురు బూతులు తిట్టుకున్నారు.
అరెస్ట్ అయిన కమల్ వరంగల్ కు చెందిన సీనియర్ బీసీ కార్యకర్త. పార్టీ కోసం చుర్గుగా పనిచేసే కమల్ ను అరెస్ట్ చేయటంపై పార్టీ కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కమల్ ను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.
ఇటు రేవంత్ రెడ్డిపై వాడు, వీడు అంటూ వీహెచ్ చాలా సార్లు కామెంట్స్ చేశాడు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ ఆ ఫిర్యాదుపై మాత్రం పోలీసులు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం గమనార్హం.