తెలంగాణలో త్వరలో ఖాళీకానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మాజీ మంత్రి చిన్నారెడ్డి, రాములు నాయక్ పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను వెలువరించింది. వరంగల్- ఖమ్మం-నల్గొండ అభ్యర్థిగా రాములు నాయక్ కు అవకాశం కల్పించిన పార్టీ.. మహబూబ్‌నగర్- హైదరాబాద్- రంగారెడ్డి అభ్యర్థిగా చిన్నారెడ్డిని నిర్ణయించింది.
మరోవైపు త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..ప్రచారంలో ఇక స్పీడ్ ను పెంచేందుకు సిద్ధమవుతోంది.