ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు నాడు టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేసి గోల్కొండ పిఎస్ కు తరలించారు. అయితే రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను గృహనిర్బంధం చేశారు. అయినప్పటికీ అక్రమ అరెస్టులకు నిరసనగా ఉద్యోగ కల్పన ప్రధాన డిమాండ్ గా టిపిసిసి దళిత కాంగ్రెస్ నాయకులు ప్రగతి భవన్ ను ముట్టడించారు.
కాగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే కేసీఆర్ అంతు చూస్తామంటూ వారు హెచ్చరించారు.
ప్రగతి భవన్ గోడలు త్వరలోనే బద్దలుకొట్టి తెలంగాణకు విముక్తి కలిగిస్తామన్నారు.