రాజీవ్ రైతు భరోసా పాదయాత్రతో ఎంపీ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఉమ్మడి మహాబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఆయన పాదయాత్ర పదిరోజుల పాటు సాగింది. యాత్ర ముగింపు సభ ఏర్పాటు చేయగా పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సహా కొందరు నేతలు హజరుకాలేదు.
ఉత్తమ్, భట్టి కొందరు సీనియర్లకు ప్రత్యేకంగా కాల్ చేసి… రేవంత్ యాత్రకు అధిష్టానం అనుమతి లేదని, సభకు వెళ్లొద్దని ఒత్తిడి చేసినట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ సాగుతుంది. సభ సమయంలో కావాలనే ఇతర కార్యక్రమాలు పెట్టుకున్నారన్నది బహిరంగ రహస్యమే.
కానీ రేవంత్ సభ సూపర్ సక్సెస్ అయ్యింది. గతంలో ఇదే ప్రాంతంలో కొంగర్ కలాన్ లో కేసీఆర్ సభ పెడితే ఫెయిల్యూర్ కాగా… రేవంత్ సభకు మాత్రం ఎవరూ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. పైగా అది రైతుల సమస్యను ప్రశ్నిస్తూ సాగిన యాత్ర కావటంతో జనం భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ లో అప్ కమింగ్ నేతంలా హజరయ్యారు. సభకు హజరైన వారిలో చాలా మందికి వెళ్లొద్దని ఫోన్స్ వచ్చాయి. కానీ వారు వినలేదు. దీంతో ఆ ఇద్దరు నేతలు పరువు పోగొట్టుకున్నారని, ఇప్పటి వరకు ఉన్న గౌరవం కూడా పోయిందని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. యుద్ధం చేసే వానికి కత్తి ఇవ్వటం ఎంత ముఖ్యమో… వెన్నుదన్నుగా ఉండటం కూడా అంతే ముఖ్యమని, కానీ తాము ఎక్కడ వెనుకబడతామోనన్న భయంతో తెరవెనుక కుట్రలు చేయటం సరికాదని మండిపడుతున్నారు.