పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. కేటీఆర్ ను రేవంత్ రెడ్డి పదే పదే విమర్శిస్తుండటంతో రేవంత్ దిష్టిబొమ్మ తీసుకొని నేరుగా రేవంత్ ఇంటికే వచ్చారు. దీంతో రేవంత్ అభిమానులు ప్రతి స్పందించటం, టీఆర్ఎస్ శ్రేణులు తోసుకరావటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అయితే, రేవంత్ ఇంటిపై దాడికి ప్రయత్నించిన టీఆర్ఎస్ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ మండిపడింది. ప్రశ్నించే నేతలను చంపేస్తారా అంటూ మండిపడింది. ఇందుకు నిరసనగా తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టి, కేసీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడి ఇంటిపైకి దాడికి రావటం ఏం రాజకీయమని, ఎవరు చెబితే దాడికి వచ్చారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.