మునుగోడులో ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేశారు. చండూరు తహసీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం కాంగ్రెస్ తరఫున ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. బంగారు గడ్డ నుంచి చండూర్ ఎమ్మార్వో ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా తరలి వచ్చారు.
నామినేషన్ సమయంలో ఆమె వెంట టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మరోవైపు ‘ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం’కార్యక్రమాన్ని ఎన్ఎస్ యూఐ చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని మునుగోడు నియోజకవర్గంలోని కోంపల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఇందులో భాగంగా నేటి నుంచి వచ్చే నెల 3 వరకు నియోజకవర్గంలోని ప్రతి గడపకు తిరిగి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పాదాభివందనం కార్యక్రమం చేయనున్నారు.