వంశీ చంద్ రెడ్డి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
మొన్న చైనా, నిన్న నేపాల్, నేడు పాకిస్థాన్…చైనా అండ చూసుకొని దాయాది దేశం పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌ను, గుజరాత్‌లోని జునాగఢ్, మనవదర్, సర్ క్రీక్‌లను తమ భూభాగంలో కలిపేసుకోవడమేకాక నియంత్రణ రేఖను(ఎల్‌ఎసీ)ని కారాకోరం పాస్ దాకా పొడిగించి, సియాచిన్‌ను పూర్తిగా పాక్‌లో అంతర్భాగంగా మార్చేసి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కొత్త మ్యాప్ ఆవిష్కరించి పాకిస్తాన్ కేబినెట్ ఆమోద ముద్ర వేయడాన్ని ఖండిస్తున్నాను. ఇటీవల నేపాల్ కొత్త మ్యాప్ విడుదల చేసి, అక్కడి పార్లమెంట్ ఆమోదం పొందిన తరహాలో పాకిస్తాన్ కూడా ఇంత ధైర్యానికి ఒడికట్టడం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే.
ఇందిరా గాంధీ సమయంలో మన దేశం వైపు కన్నెత్తి చూసే దైర్యం కూడా చేయలేని పాకిస్థాన్ కి ఎంత ధైర్యముంటే మన బూబాగాన్ని వాళ్ళ చిత్రపటంలో కలుపుకుంటదంటే అర్ధం ఏంటి ? మొన్న చైనా, నిన్న నేపాల్, నేడు పాకిస్థాన్. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ లో భారత దేశ భద్రతకు భంగం కలిగే ప్రమాదం చాలా ఉంది. ప్రధానమంత్రి మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలను కూల్చడంలో ఉన్న శ్రద్ధ, భారత భూభాగాన్ని కాపాడుకోవడంలో లేదు. భారత దేశ ప్రయోజనాలకన్నా వారి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైనట్టు కనిపిస్తుంది.