కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహించడానికి ఆర్మీ సిద్దంగా ఉందిన ముకుంద్ నరవనే చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ లోక్ సభా పక్ష నేత అధిర్ చౌదరి స్పందిస్తూ ఈ సూచనలు చేశారు. జమ్మూ కశ్మీర్ భారత్ లో అంతర్భాగమని…ఆక్రమిత కశ్మీర్ లో ఉన్న సైనిక బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ 1994 లోనే పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకొని సైన్యానికి ఆదేశిలిస్తుందని చెప్పారు. ఒకవేళ మీరు పాక్ ఆక్రమిత కశ్మీర్ పట్ల చర్యలు తీసుకోవాలనుకుంటే భారత ఆర్మీ చీఫ్ డిఫెన్స్ చీఫ్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చించాలి కాని ఇలా బహిర్గతంగా మాట్లడటం తగదన్నారు.
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » ఆర్మీ చీఫ్ కు కాంగ్రెస్ ఉచిత సలహా