మోడీని చంపగలను అంటూ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అయితే.. దీనిపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు. చంపగలను అని చేసిన వ్యాఖ్యలు ప్రధానిని ఉద్దేశించి కాదని నానా పటోలే అన్నారు. తన నియోజక వర్గంలో మోడీ పేరుతో ఉన్న ఓ నేరస్థుడికి వార్నింగ్ ఇస్తూ అలా మాట్లాడానని తెలిపారు. ప్రధాని మోడీపై ఈ వ్యాఖ్యలు చేసినట్టు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రచారం చేయడం దుర్మర్గమని మండిపడ్డారు.
కాగా.. సోమవారం జిల్లా పరిషత్, పంచాయతీ సమితి ఎన్నికల ప్రచారంలో భాగంగా నానా పటోలే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మోడీని తాను చంపగలనని, దూషించగలను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 30 ఏళ్లగా తాను రాజకీయాల్లో ఉన్నానని.. తన పేరు మీద ఒక్క స్కూల్ కూడా లేదని చెప్పారు.
నిజాయితీతో రాజకీయం చేస్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో ఆయన ప్రధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నానా పటోలే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రధాని కాన్వాయ్ ని పంజాబ్ లో 20నిమిషాల పాటు రోడ్డుపై ఆపేశారని.. ఇప్పుడు చంపేస్తామంటున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ దోరణిపై తనకు తనకు అనుమానం ఉందనే విషయాన్ని ఆయన పరోక్షంగా చెప్పారు. నానా పటోలే చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు.
ఈ అంశాన్ని బీజేపీ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బలంగా వాడుకునే అవకాశం కనిపిస్తోంది. కాగా.. పంజాబ్ లో ప్రధాని మోడీ కాన్వాయ్ అడ్డుకున్న విషయం కూడా దేశ వ్యాప్తంగా సంచలనం రేగింది. దీనిపై సుప్రీం కోర్టు ఓ కమిటిని వేసి విచారణ చేపడుతోంది.