కాంగ్రెస్ చింతన్ శివిర్ కార్యక్రమం నేటితో ముగియనుంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం రోడ్‌మ్యాప్‌తో పాటు డిక్లరేషన్‌ను సిద్ధం చేయడానికి ఆరు కమిటీలు ఇచ్చిన సిఫార్సులపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) చర్చించనుంది.
దాదాపు తొమ్మిదేండ్ల తర్వాత ఉదయ్ పూర్ లో చింతన్ శివిర్ ను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. దీనికి దాదాపు 430 మంది కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు.
ఆరు కమిటీలు అందించిన ముసాయిదాపై నేడు మొదట అర్ధభాగంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించనుంది. అనంతరం తుది ఆమోదం కోసం పార్టీ అధిష్టానానికి ఆ ముసాయిదాను పంపనుంది.
అనంతరం చింతన్ శివర్ కార్యక్రమం చివరలో కార్యకర్తలను ఉద్దేశించి సోనియాగాంధీ ప్రసంగించనున్నారు. దాని కన్నా ముందు చింతన్ శివిర్‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.